- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదకరంగా మారిన పెద్ద చెరువు..
దిశ, కామారెడ్డి : రాజంపేట మండల కేంద్రంలోని ఊర పెద్ద చెరువు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కట్ట కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. గత వారం రోజుల క్రితం ఇదే పరిస్థితి ఉంటే కట్టపై మొరం వేసి మరమ్మత్తులు చేపట్టారు. అయినా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చెరువు కట్ట దాదాపు రెంద ఫీట్ల మేర కుంగింది. ప్రస్తుతం మరొక భారీ వర్షం పడితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. కట్ట తెగిపోతే కట్టకుండా ఉన్న సుమారు మూడు వందల ఎకరాల పంటలు నీట మునిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి కట్టపై తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని, లేకపోతే రైతులు భారీగా నష్టపోతారని వేడుకుంటున్నారు. సోమవారం మండల కేంద్రం పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి కట్ట కుంగిన విషయాన్ని గ్రామస్తులు తీసుకుపోగా కుంగిన కట్టను పరిశీలించారు. ఉపాధిహామీ ద్వారా వెంటనే కట్టకు మరమ్మత్తులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.