- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో టెన్షన్.. టెన్షన్
దిశ, వెబ్‌డెస్క్ : వీర బ్రహ్మేంద్ర స్వామి మఠానికి చేరుకున్న పీఠాధిపతులు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆలయం వెలుపల నుంచి దర్శించుకున్నారు. పీఠాధిపత్యం తమకంటే తమకని బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో పీఠాధిపత్య సమస్యను పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది. 9గంటలకు ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం అమ్మవారి శాల కమిటీ సభ్యులతో పీఠాధిపతులు సమావేశం కానున్నారు. తర్వాత బ్రహ్మంగారి వారసులతో సమావేశం అవుతారు.
వీర బ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి విషయంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మాహాలక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై పీఠాధిపతి కృష్ణమాచార్యులు స్పందించారు. శివస్వామి ఆధ్వర్యంలో మేము మొదటిసారి బ్రహ్మంగారి మఠానికి వచ్చినప్పడు ఆమె ఎలాంటీ భేదాభిప్రాయం చూపలేదు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. మఠం మేనేజర్ తో పాటు మరికొంతమంది ప్రోద్బలంతోనే ఆమె ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేశారని అన్నారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి ఎంపిక విషయంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తామని బ్రహ్మపదం పీఠాధిపతి కృష్ణమాచార్యులు తెలిపారు. అలాగే సాయంత్రం మీడియాతో సమావేశం కానున్నట్టు పేర్కొన్నారు. పీఠాధిపతుల రాకతో మఠాన్ని భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.