- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయసే మ్యాటర్.. మరేదైనా లేటర్!
దిశ, ఫీచర్స్: అమ్మాయిలు, అబ్బాయిల నడుమ టీనేజ్‌లో మొదలయ్యే అట్రాక్షన్.. ఒక్కో స్టేజ్‌లో ఒక్కో మలుపు తీసుకుంటుంది. సాధారణంగా ఆ ఏజ్‌లో అపోజిట్ జెండర్‌పై కలిగే ఆకర్షణకు పెద్దగా కారణాలు ఉండకపోవచ్చు. అది వయసు ప్రభావమే అయినా, ఆ తర్వాత మెచ్యురిటీ పెరిగేకొద్దీ పార్టనర్‌ను ఎంచుకునే క్రమంలో ఆ వయసే మెయిన్ ఫ్యా్క్టర్‌గా మారే అవకాశం ఉంది. నిజానికి మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా.. ఏజ్, అట్రాక్టివ్‌నెస్, ఫిజికల్ అప్పియరెన్స్, ఎడ్యుకేషన్, ఎమోషన్, ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్ వంటి క్యారెక్టరిస్టిక్స్‌ను బేస్ చేసుకునే తమ పార్టనర్‌కు అట్రాక్ట్ అవుతుంటారు. ఒక్కొక్క ఇండివిడ్యువల్ విషయంలో ఇంపార్టెన్స్ మారుతుండవచ్చు గానీ, మొత్తం మీద పై లక్షణాలదే కీ రోల్. అయితే ఈ మ్యాటర్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేలా ఆలోచిస్తారా? తమ భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఒకే తరహా భావాలను కలిగి ఉంటారా? అనేదే ప్రశ్న. ఈ సందేహాలపై తాజా అధ్యయనం వెల్లడించిన వివరాలు మీ కోసం..
యువకులు తమ పార్టనర్‌కు సంబంధించి అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే, అమ్మాయిలు మాత్రం అబ్బాయిల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ వయసులో ఉన్నప్పుడు ఫిజికల్ అప్పియరెన్స్ ఒక్కటే మిగతా లక్షణాలను డామినేట్ చేస్తుందన్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. మేల్, ఫిమేల్ తమ భాగస్వామికి సంబంధించి నిర్దేశించుకున్న లక్షణాలు వేర్వేరుగా ఉన్నా, ఏజ్ విషయానికొస్తే మాత్రం దగ్గరి పోలికలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 7 వేలకు పైగా ఆస్ట్రేలియన్ ఆన్‌లైన్ డేటింగ్ యూజర్లపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో పాల్గొన్న 16-65 సంవత్సరాల మధ్య గల7,325 మందిని తొమ్మిది రకాల లక్షణాలపై 0 నుంచి 100 వరకు రేటింగ్ వరకు ఇవ్వమని రీసెర్చర్స్ కోరారు.
మూడు కేటగిరీలుగా లక్షణాలు..
అమ్మాయిలు, అబ్బాయిలు తమ పార్టనర్‌లో కోరుకునే లక్షణాలను మూడు కేటగిరీలు : సౌందర్యం (ఏజ్, అట్రాక్టివ్‌నెస్, ఫిజికల్ బిల్డ్), రిసోర్సెస్(ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, ఇన్‌కమ్), వ్యక్తిత్వం(ట్రస్ట్, ఓపెన్‌నెస్, ఎమోషనల్ కనెక్షన్)గా విభజించి ఈ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో స్త్రీ పురుషులిద్దరూ అట్రాక్టివ్‌నెస్, ఫిజికల్ బిల్డ్‌తో పాటు వ్యక్తిత్వానికి సంబంధించిన మూడు లక్షణాలకు ప్రాధాన్యతనివ్వగా.. ఆదాయానికి తక్కువ రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇక 18-25 సంవత్సరాల పురుషులు ‘అందం, ఆకర్షణకు’ ఇంపార్టెన్స్ ఇవ్వగా, వయసు పెరిగే కొద్దీ వీటికి ప్రాముఖ్యతను తగ్గించారు. అదే అమ్మాయిలు మాత్రం ఏజ్, ఎడ్యుకేషన్, ఇన్‌కమ్, ట్రస్ట్, ఎమోషనల్ కనెక్షన్‌కే కట్టుబడి ఉన్నారు. ప్రత్యేకించి 25 ఏళ్ల లోపువారు అదే వయసున్న అబ్బాయిలతో పోలిస్తే.. వ్యక్తిత్వానికే మొగ్గుచూపారు. కానీ 30 ఏళ్లు పైబడిన వారిలో ఆ అంతరం తగ్గింది. ఇక 60, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులు మాత్రం వ్యక్తిత్వ కారకాలకే ఎక్కువగా రేటింగ్ ఇచ్చారు. ఈ మేరకు రెండు జెండర్స్‌లోనూ వయసు పెరిగేకొద్దీ ఓపెన్‌నెస్, నమ్మకానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం స్పష్టమైంది. కాగా భాగస్వామిలో ఆకర్షించిన లక్షణాలు.. వారి వయసు సంబంధిత జీవనశైలిని ప్రస్ఫుటం చేశాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రచయిత స్టీఫెన్ వైట్ చెప్పారు.
ఓల్డ్ థియరీస్ ప్రకారం..
పరిణామాత్మక మనస్తత్వశాస్త్రంలో తల్లిదండ్రుల పెట్టుబడి అనే సిద్ధాంతానికి పురుషులు, మహిళల మధ్య ప్రాధాన్యతల్లో ఉండే తేడాలే కారణమని వైట్ సూచించారు. భాగస్వాములను ఎన్నుకునేటప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉంటారని, ఎందుకంటే తమ సంతాన మనుగడ కోసం పునరుత్పత్తి విషయంలో పురుషులు మరింత పెట్టుబడి పెడతారని నమ్ముతారని ఈ సిద్ధాంతం చెబుతుంది. కానీ డీకిన్ యూనివర్సిటీకి చెందిన మరొక రచయిత ఆల్బా.. సోషలైజేషన్ ప్రభావం వల్ల అనేక రకాల లింగ బేధాలు ఉన్నప్పటికీ, పరిణామక్రమంలో పుట్టుకొచ్చిన అనేక డిమాండ్లు కూడా ఈ విషయంలో ప్రముఖ పాత్రను కలిగివుంటాయని తెలిపారు. అయితే పురుషులకు గర్భాన్ని మోసే, పాలిచ్చే అవసరం ఉండదు కాబట్టి ఎంతమంది పిల్లలకైనా జన్మనిచ్చే అవకాశం ఉందన్నారు. వారికి లైఫ్ లాంగ్ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంటుంది కనుక తమ కంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో కూడా జతకట్టవచ్చని అన్నారు. అయితే ఈ సిద్ధాంతం ‘నిరంతర సెక్సిజం’ అంటూ పరిశోధకులచే విమర్శలకు గురైంది. కాగా ఒక నిర్దిష్ట లక్షణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు బహుళ లక్షణాల గురించి చాలా శ్రద్ధ వహించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. అంటే పర్టిక్యులర్ విషయంపై ఎక్కువ ఇష్టం ప్రదర్శిస్తే.. చాలా విషయాల గురించి పట్టించుకునే అవకాశం ఉందని వైట్ వెల్లడించారు.
ఈ లెక్కన.. పునరుత్పత్తి సామర్థ్యంతో పాటు బాగా సంపాదిస్తున్న 25 నుంచి 40 ఏళ్ల వయసు గల పురుషులు, 35 నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళల్లో ఈ లక్షణాలు ఒకే విధంగా ఉండనున్నాయి. అయితే ప్రాధాన్యతా తీవ్రతలో ఇండివిడ్యువల్ వేరియేషన్స్ ఉండొచ్చని రచయిత వైట్ తెలిపారు. కాగా ఈ అధ్యయనం.. సెక్సువాలిటీ, జెండర్ ఐడెంటిటీ అనే అంశంపై విస్తృత పరిశోధనా ప్రాజెక్టు అయిన ఆస్ట్రేలియన్ సెక్స్ సర్వేలో ఓ భాగం కాగా, డేటింగ్ యాప్ ‘అడల్ట్ మ్యాచ్ మేకర్స్’తో పాటు దాని అనుబంధ సైట్లకు చెందిన యూజర్లు ఇందులో పాల్గొన్నారు. అయితే వారంతా టిండర్ లేదా బంబుల్ వంటి ఇతర డేటింగ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారా అనే విషయాన్ని ప్రత్యేకించి అడగకపోవడం గమనార్హం. అందుకే ఈ అధ్యయన ఫలితాలను మొత్తం సమాజానికి ఆపాదించలేమని రచయిత వైట్ పేర్కొన్నాడు.