కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా చూడాలి : డీఐజీ రంగనాధ్

by Shyam |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ : జిల్లాలోని అన్ని స్థాయిల పోలీస్ అధికారులు అన్ని వర్టీకల్స్‌ను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని డీఐజీ ఏ.వి.రంగనాధ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ఫంక్షనల్ వర్టీకల్స్ సమావేశంలో ఆయన పోలీస్ స్టేషన్ల వారిగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టీకల్స్ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా ఉండేలా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు అన్ని స్థాయిల అధికారులు అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు.

కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగేలా చూడాలని, తద్వారా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందని.. భయం నేరం చేసే వారిలో కలుగుతుందని, పోలీస్ శాఖలోని వర్టీకల్స్‌లో ఈ వర్టీకల్ చాలా ముఖ్యమైనదన్నారు. నేర విచారణలో నాణ్యత మరింత పెరిగేలా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. పోలీస్ శాఖలో అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ధ వహించి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు, ప్రజలకు మర్యాద ఇస్తూ వారిచ్చే దరఖాస్తులను సాధ్యమైనంత త్వరితంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్ కు విధిగా స్పందించడంతో పాటు త్వరితంగా ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పని చేయాలని సూచించారు.

సమావేశంలో డీటీసీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సీఐలు బాలగోపాల్, సత్యం, సురేష్ కుమార్, గౌరు నాయుడు, ఆదిరెడ్డి, నిగిడాల సురేష్, శంకర్ రెడ్డి, నాగరాజు, డీఎన్.డీ. ప్రసాద్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ఆర్ఐలు నర్సింహా చారి, ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, యాదయ్య, నర్సింహ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story