- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో పెరుగుతున్న ‘పద్మశ్రీ’డిమాండ్.. పునీత్ కి ఇవ్వాలని నెట్టింట వైరల్..
దిశ, వెబ్ డెస్క్ : పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు పూడ్చలేనిది. అతను గొప్ప నటుడు అయినప్పటికి తన జీవితాన్ని మాత్రం చాలా సాదారణంగా గడిపాడు. కాని అతను చేసిన మంచి పనులన్నీ అతని మరణానంతరం మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అతను చాలా మంది అనాథ పిల్లలను చూసుకున్నాడు. చాలా మందికి విద్యను అందించాడు. అలాగే ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. ఇప్పుడు పునీత్‌కు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులోని పునీత్ మెమోరియల్‌ని రోజూ వేల సంఖ్యలో అభిమానులు సందర్శిస్తున్నారు. చాలా మంది అభిమానులు నటుడి మెమోరియల్‌లో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. వీటన్నింటి మధ్యలో పునీత్‌కి పద్మశ్రీ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.
ప్రముఖ ఆంగ్ల వార్తా దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం, పునీత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేయాలని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ముఖ్యమంత్రిని కోరారు. “నేను పునీత్‌కి పెద్ద అభిమానిని. పద్మశ్రీకి పునీత్ నటుడిగానే కాకుండా సమాజానికి చేసిన సేవలకు కూడా అర్హుడు” అని అన్నారు. ఈ డిమాండ్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ కూడా మద్దతు తెలిపారు. పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం పద్మ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన మరికొందరు ప్రముఖ వ్యక్తులలో నటుడు ప్రేమ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ డిమాండ్‌కు తమ గొంతును కలుపుతున్నారు. మరోవైపు, ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ 2020 విజేతలకు పద్మ అవార్డులను అందజేశారు.