ఎగరలేని వింత పావురం.. ఫ్లిప్స్ చేస్తూ ప్రయాణం

by Shyam |   ( Updated:2023-10-10 15:18:14.0  )
parrot
X

దిశ, ఫీచర్స్ : భూమిపై ఫ్లైట్‌లెస్ పక్షి జాతులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పార్లర్ రోలర్ పావురం మాత్రమే అన్నింటికంటే భిన్నమైంది. ఇది ఆకాశంలో ఎగరదు, భూమిపై నడవదు, తిరిగేందుకు పూర్తిగా వింతైన మార్గంలో దాని నడక సాగుతోంది. మరి అదెలా ప్రయాణం చేస్తుందో తెలుసుకోవాలని ఉందా?

అనేక జాతులు కలిగున్న పావురాలు.. సాధారణంగా గాల్లో ఎగురుతాయి. కానీ ‘పార్లర్ రోలర్’ మాత్రం ఫ్లిప్స్ చేస్తుంది. అర్థం కాలేదా? అవి వెనక్కి రోల్ చేసుకుంటూ తమ గమ్యాన్ని చేరుకుంటాయి. అయితే ఈ లక్షణం వాటికి సహజసిద్దంగా వచ్చింది. కాగా ఈ జాతి ఎలా? ఎప్పుడు? అభివృద్ధి చెందిందో సరైన ఆధారాలు లేవు. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం 19వ శతాబ్దం మధ్యకాలం నుంచే వీటి మనుగడ ఉందని సమాచారం.

చూడ్డానికి ఇతర పావురాలలాగే ఉన్నా ఈ పార్లర్ రోలర్.. పలు రంగుల్లో ఉండి, 7 నుంచి 10 ఔన్సుల బరువు ఉంటాయి. అయితే ఇవి గాల్లో ఎగరపోవడానికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ కొందరు మాత్రం మెదడు య బ్యాలెన్స్ సెంటర్‌లలో కొంత లోపం ఉండటం వల్లే అవి ఎగరలేకపోతున్నాయని చెబుతున్నారు. ఇక ఇవి బ్లాక్ ప్లిఫ్స్ చేస్తుండటంతో చాలామంది రేసుల కోసం పెంచుతుంటారు. ఫ్యాన్సీయర్లు వాటిని అరచేతిలో పట్టుకుని బౌలింగ్ బాల్స్ లాగా మైదానంలోకి విసురుతారు. ఆ పక్షులు కొన్ని వందల అడుగుల వరకు తిరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో అవి వెళ్లిన దూరాన్ని లెక్కిస్తారు. ఇప్పటివరకు 662 అడుగుల దూరం వరకు ప్లిఫ్స్ చేస్తూ వెళ్లిన పావురం పేరిటే రికార్డ్ ఉంది.

ఇక పార్లర్ టంబ్లర్ ఇందులో మరో జాతి కాగా, రెండింటి మధ్య చిన్నపాటి వ్యత్యాసం ఉంది. టంబ్లర్ ఎగరడంతో పాటు గాల్లో ప్లిఫ్స్ చేస్తుంది. అయితే రోలర్ మాత్రం సుమారు మూడు నెలల వయసు వరకు మాత్రమే ఫ్లై చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed