పాపికొండల అందాలు చూసొద్దాం రండి

by srinivas |
పాపికొండల అందాలు చూసొద్దాం రండి
X

దిశ, వెబ్ డెస్క్ : పాపికొండల అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. దీంతో 18 నెలల పాటు ఈ విహారయాత్ర ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పాపికొండల అందాలను చూస్తు గోదారిలో విహరించే అవకాశం మరోసారి కల్పించారు. ఈ నెల 15 నుంచి పాపింకొండల పర్యటన ప్రారంభం కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారు కాస్త ఊరట, ఆనందం కోసం ఇక పాపికొండలకు వెళ్లాల్సిందే. ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ టీఎస్ వీరనారాయణ తెలిపారు. పాపికొండల పర్యాటకుల కోసం త్వరలోనే ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచుతామన్నారు.

Advertisement

Next Story