- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోరం.. తీసుకున్న సొమ్ము ఇవ్వలేదని ప్రియురాలి పై దారుణం..
దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన అమ్మాయి తీసుకున్న డబ్బు ఇవ్వలేదని ఏకంగా గొంతు నులిమి చంపేశాడు ఓ ప్రభుద్దుడు. కర్నాటకలోని ఎలహంక లో యోగా శిక్షణ కేంద్రాన్ని శ్యాం అనే యువకుడు నిర్వహిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం గంగా అనే యువతి యోగా నెర్చుకోవడానికి వచ్చింది. మెల్లిగా వారి పరిచయం ప్రేమగా మారింది.
పెద్దలు కూడా ఈ వివాహానికి ఒప్పుకున్నారు. రాబోయే ఫిబ్రవరిలో వివాహం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంతలో ఏదో అవసరం కొద్దీ శ్యాం నుండి ప్రియురాలు లక్షరూపాయలు తీసుకుంది. అయితే ఎంతకీ తిరిగి ఇవ్వక పోవడంతో ఇద్దరి మధ్యన గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం గొడవ పెద్దది అవడంతో కోపం తట్టుకోలేక శ్యాం ఆమె గొంతును నులిమేశాడు.
దాంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శ్యాం చాకచక్యంగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. తదుపరి విచారణ కోసం శ్యాం ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
- Tags
- love marriage