మనవరాలి బర్త్ డేకు వెళ్లి వచ్చిన తాత.. రెండు రోజులకు ఆ స్థితిలో..!

by Sridhar Babu |   ( Updated:2021-12-26 12:11:13.0  )
Lingaiah
X

దిశ, చందుర్తి : మనవరాలి పుట్టినరోజు వేడుకకు హాజరై వచ్చిన తాత అదృశ్యమయ్యాడు. ఇంటికి వచ్చి వ్యక్తి బయటకు వెళ్లి.. మళ్లీ తిరిగి రాలేదు. వస్తాడేమోనని రెండు రోజులుగా ఎదురు చూసిన వారికి శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసికంటి రాజయ్య (85) మనవరాలి పుట్టినరోజుకు ఫంక్షన్ ఈనెల 24న జరిగింది. ఆ కార్యానికి వెళ్లి వచ్చిన రాజయ్య ఇంటి నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.

రాజయ్యకు మద్యం తాగే అలవాటు ఉండటంలో తాగి ఎక్కడో ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. రెండు రోజులైన ఆయన ఆచూకీ లేకపోవడంతో గ్రామంలో వెతికారు. ఇంటి సమీపంలో బావిలో చూడగా.. వృద్ధుడు అందులో శవమై కనిపించాడు. సర్పంచ్ నేతికుంట జలపతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టానికి తరలించారు. కాగా, తన భర్త కాలు జారి బావిలో పడి ఉంటాడని ఆయన భార్య రామవ్వ పోలీసులకు తెలిపింది. తనకు ఎవరిపై అనుమానం లేదని వివరించారు. మృతుడికి భార్య రామవ్వతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు.

Advertisement

Next Story