- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రమ్య కేసు పై స్పందించిన జాతీయ ఎస్సీ కమీషన్.. జగన్ సర్కార్ ను ఏమందంటే ?
దిశ, ఏపీ బ్యూరో: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏపీ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. ఘటన జరిగిన 24 గంటల్లోపు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ఎస్సీ కమిషన్‌కు వివరించినట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యలకు జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి చెందిందని పేర్కొన్నారు. మరోవైపు రమ్య కుటుంబ సభ్యులు సైతం జగన్ సర్కార్ తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని ఎస్సీ కమిషన్‌కు తెలిపిందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించలేదని కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి నాలుగు రోజుల్లో న్యాయం చేసిందని కమిషన్ అభిప్రాయపడినట్లు జూపూడి తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించామన్నారు. రమ్య హత్య ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని..ఇకనైనా మానుకోవాలని జూపూడి హితవు పలికారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన వారిలో వైసీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, మేరుగ నాగార్జున, విడదల రజని, లక్ష్మణ్‌రెడ్డి ఉన్నారు.