- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎందరు పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే.. బిల్లుకు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(AP Assembly) పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే పలు బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లులపై సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు కీలక బిల్లుల(Several Bills)కు ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్(Panchayat Raj, Municipal) చట్ట సవరణ బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని నిర్ణయించారు. పట్టణ, స్థానిక ఎన్నికల్లో పోటీ నిబంధనలను మార్పు చేశారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్, శాసనా సవరణ బిల్లు(Municipal and Legislative Amendment Bill)కు ఆమోదం తెలిపారు. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. మండలి ఆమోదం తర్వాత ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. వివిధ శాఖల గ్రాంట్లకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం ఏపీ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.