Aamir Khan: థెరపీ నాకెంతో సాయం చేసింది.. ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

by sudharani |
Aamir Khan: థెరపీ నాకెంతో సాయం చేసింది.. ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ (Bollywood Star) హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రజెంట్ ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. R.S ప్రసన్న (R.S Prasanna) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ (Sports) డ్రామాగా రాబోతుంది. అమీర్ ఖాన్, కిరణ్ రావు నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘నా కూతురు ఐరాతో నాకు సరిగ్గా మాటలు లేవు. ఆ సమయంలో నేను థెరపీ తీసుకున్నాను. ఈ విషయంలో నన్ను నా కూతురే ఒప్పించింది. మేమిద్దరం కలిసి థెరపిస్ట్‌ను కలిశాం. దీంతో ఎన్నో ఏళ్లుగా మా మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయి బంధం ఏర్పడింది. అందుకు సంతోషంగా ఉన్నా. నాకు నేను చాలా తెలివైన వాడిని ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించేస్తానని అనుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో అలా చేయలేను. నేను మాత్రమే కాదు. చాలామంది అలాగే ఉంటారు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, కొన్ని విషయాలు మాత్రమే అర్థం చేసుకోగలం. కానీ అన్నింటిని అర్థం చేసుకునే ఒక థెరపిస్ట్ (Therapist)ను కలిస్తే మనకు ఎంతో ఉపశమనం దొరుకుతుంది. మనదేశంలో చాలామంది థెరపిస్ట్‌ని కలవడానికి వెనకడుగు వేస్తారు. దానికి కారణాలెన్నో ఉన్నా థెరపిస్ట్‌ను కలిస్తే వారి మానసిక ఆరోగ్యం బాలేదని ఆలోచిస్తారు. అలాగే తమను వేరేలా చూస్తారనే భయాల వల్ల చాలామంది దీనిపై ఆసక్తి చూపించరు. కానీ అలా చేయకుండా పక్కనపెట్టడం మంచిదని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story