- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kitchen tips: ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ కిచెన్ మెరిసిపోతుంది!
దిశ, ఫీచర్స్: మహిళలందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవడం. కిచెన్ శుభ్రంగా లేకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బొద్దింకలు, బల్లులు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా నీట్‌గా ఉంచుకోవడం వల్ల పని ఒత్తిడిని దరిచేరనివ్వదు. ఈ టిప్స్ పాటించారంటే మీ వంటింట్లో సమయం ఆదా అవ్వడమేకాకుండా.. శ్రమ తగ్గి కాస్త విశ్రాంతిగా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చదివేయండి.
* వంటగదిలో వాష్ బేసిన్ ముఖ్యమైనది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో తిన్న సామాన్లను శుభ్రం చేస్తుంటారు. అందులో ఉండే నూనె, కొవ్వు పదార్థాలు సింక్‌లోనే ఉండిపోతాయి. దీని వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది. అందుకే దీనిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సింక్ శుభ్రంగా ఉండేందుకు నాఫ్తలీన్ గోళీలు ఉపయోగపడతాయి. వీటిని సింక్ లోపల వేయకుండా పైప్ దగ్గర ఉంచాలి. ఇలా చేస్తే, సింక్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.
* అలాగే వంటగదిలో రోజు వినియోగించే పాత్రలన్ని ఒక చోట సెట్ చేసుకోవాలి. దీని వల్ల టైమ్ ఆదా అవ్వడమే కాకుండా కిచెన్ చూడడానికి నీట్‌గా కనిపిస్తుంది. లేదంటే అవసరాని కంటే ఎక్కువగా పాత్రలను క్లీన్ చేయాల్సి వస్తుంది.
* చాలామంది కిచెన్‌లో కనిపించిన పదార్థాలన్నింటిని ఫ్రిజ్‌లో కుక్కేస్తుంటారు. దీని వల్ల ఫ్రిజ్ చూడడానికి శుభ్రంగా కనిపించదు. అందుకే స్టోర్ బ్యాగ్స్, బ్యాక్సులు, ఫ్రిజ్ మ్యాట్‌లు ఉపయోగించడం వల్ల, ఫ్రిజ్ నీట్‌గా కనిపిస్తుంది. కావల్సినప్పుడు ఆహార పదార్థాలను కూడా ఈజీగా తీసుకోవచ్చు.
* వంటగదిలో డస్ట్ బిన్‌ను వాడుతున్నట్లైతే దానిని ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసుకొని, ప్రతి రోజూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీనికి కవర్ ఉపయోగించాలి. డస్ట్ బిన్‌కి మూత ఉంటే మంచిది. లేదంటే ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి కీటకాలు అందులో చేరే అవకాశం ఉంది. వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
* చాలామంది వంటిగది పలకలపైనే చపాతీలు, కూరగాయాలు కట్ చేయండం వంటివి చేస్తుంటారు. అలా చేసినప్పుడు వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రపరుచుకోవాలి. అంతేకాదు వంట చేసిన ప్రతీసారి పలకలను శుభ్రంగా ఉంచుకుంటే మంచిది.
* అలాగే వంటింట్లో ఉండే నిత్యావసర పప్పులు, మసాలా దినుసులు, నూనె వంటి వాటిని పారదర్శకంగా ఉండే సీసాల్లో లేదా స్టీల్ బాక్సుల్లో వేసుకొని, లేబులింగ్ చేసుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల మీ పని సులువుగా అవుతుంది.
* మైక్రోవేవ్ ఓవెన్, ఫ్రిజ్ లోపలి భాగాలని ఎప్పుడూ శుభ్రం చేస్తుండాలి. లేదంటే ఇందులో వైరస్‌లు, బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతాయి. వారానికి ఒకసారి అయినా వీటిని శుభ్రం చేయడం మంచిది.
* కొన్ని సందర్భాల్లో స్టవ్ మీద ఆహార పదార్థాలు పడిపోతాయి. వాటిని వెంటనే శుభ్రం చేయాలి. ముఖ్యంగా పాలు, పెరుగు వంటివి పడినప్పుడు వెంటనే క్లీన్ చేయాలి. లేకుంటే బ్యాక్టీరియా, ఈగలు, దోమలు వంటివి వస్తుంటాయి. శుభ్రంచేసేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.