- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీ మార్గేమే.. రాచ మార్గం.. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి నీలిమ
దిశ, మెదక్: రాజీ మార్గమే రాచ మార్గమని రాజీ కుదుర్చుకునే అవకాశాలున్నా కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని మెదక్ జిల్లా ఇంచార్జి 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ సూచించారు. శుక్రవారం జిల్లా సెషన్స్ కోర్టులో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. డిసెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో ప్రతి రెండు మాసాలకొకసారి లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక సంబంధమైన కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు, బ్యాంక్ రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. ప్రధానంగా ఈ లోక్ అదాలత్ పెద్ద మనసుతో క్షమించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారమయ్యే విధంగా చూస్తుందని అన్నారు.
సివిల్ తగాదాలో రాజీ మార్గం ద్వారా పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా వెనుకకు తీసుకునే అవకాశముందని ఆమె తెలిపారు. దీనిని కక్షిదారులు న్యాయవాదులు, పోలిసు అధికారులు, బ్యాంకులు, విద్యుత్, తదితర అధికారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవలనదిగా ఆమె సూచించారు. ఈ లోక్ అదాలత్‌లో 139 కేసులు పరిష్కార దిశగా గుర్తించామని, ఆ నాటికి మరికొన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూస్తామని నీలిమ తెలిపారు. ఈ ప్రెస్ మీట్‌లో జూనియర్ సివిల్ జడ్జ్ రీటా లాల్ చంద్, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ కల్పన తదితరులు పాల్గొన్నారు.