- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్: పాదయాత్ర పేరు ప్రకటించిన రాజాసింగ్
దిశ, చార్మినార్: చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ శాసనసభామండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్ విఎస్ ప్రభాకర్, యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి పాలన విముక్తి కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభిస్తున్న పాదయాత్రకు ప్రజా సంగ్రామయాత్రగా పేరును బీజేపీ శాసనసభ పక్ష నేత రాజాసింగ్ ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2023లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని, పాదయాత్రలో కేంద్రమంత్రులు సైతం పాల్గొంటారని తెలిపారు.
తొలివిడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు కొనసాగుతుందన్నారు. పాదయాత్ర విజయవంతం కోసం 29 కమిటీలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు అమలు చేసే వరకు సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతుందని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకున్న ఓవైసీ చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్ పెట్టారన్నారు. సంతలో పశువులు, కుక్కలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుక్కున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఏపీ అక్రమంగా నీళ్లను తీసుకెళ్తుంటే ఆపే దమ్ము కేసీఆర్కు లేకుండా పోయందన్నారు. గోషామహల్ అభివృద్దికి రూ. 2వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్దమని రాజాసింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండుయాదవ్, ఉమామహేంద్ర, గాజుల హనుమంత్ రావు, అందెల శ్రీరాములు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.