- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని నవ వధువు హత్య.. చివరికి..
దిశ, కుత్బుల్లాపూర్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని నవ వధువుని హత్యచేసిన దంపతులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ కు చెందిన రాజేష్ ఉపాధి కోసం కుత్బుల్లాపూర్ లోని వినాయకనగర్ కు వలస వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. అదే ఇంటిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆరాంఘర్ జిల్లాకు చెందిన సంజీత్(35), రింకు(24) దంపతులు 5 సంవత్సరాలుగా షేరింగ్ గా ఉంటున్నారు. సంజీత్ కూకట్‌పల్లిలో ఆటో నడుపుతుంటాడు. అయితే సంజీత్ విధులకు వెళ్లిన సమయంలో రాజేష్, రింకు ల పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
సంజీత్ ఆటో నడుపుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో, మొదటి నుండి రాజేష్ ఇంటి కిరాయి, ఇంట్లో ఖర్చులను పెడుతుండేవాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాజేష్ సొంతూరుకు చెందిన పూజను వివాహం చేసుకొని అదే ఇంట్లో ఉంటున్నాడు. రాజేష్ అప్పటి నుండి రింకు ను పట్టించుకోవడం లేదు. నూతన దంపతులు రాజేష్, పూజ వేరుగా ఉంటామని చర్చించుకుని అద్దె ఇంటికోసం వెతుకుతున్నారు. ఇది నచ్చని రింకు దంపతులు ఎలాగైనా పూజను అడ్డు తొలగించుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన రాజేష్ డ్యూటీ కి వెళ్లిన వెంటనే ఉదయం 8.30 గంటలకు రింకు, సంజీత్ లు పూజ ముఖంపై మెత్తతో ఉపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను తస్కరించి దాచుకున్నారు.
రాజేష్ వచ్చాక ఎవరో పూజ ప్రేమికుడు, అతని స్నేహితుడితో కలిసి వచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా నిరకరించిందని, కోపంతో హత్య చేసి నగలతో పారిపోయారని పిట్ట కథలు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలు గమనించగా కొత్తవారెవరు రాలేదని నిర్దారించారు. రింకు, సంజీత్ లను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. రింకు, సంజీత్ లను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.