బోయినపల్లిలో దారుణం.. తల్లీకూతుళ్ల అనుమానస్పద మృతి

by Sumithra |
Rajasthan--Family
X

దిశ, కంటోన్మెంట్: అనుమానాస్పద స్థితిలో తల్లీకూతురు మృతిచెందారు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రంలోని నోహర్ ప్రాంతానికి చెందిన విజయ్ భాటియా(44) కుటుంబంతో సహా హైదరాబాద్ నగరానికి వలస వచ్చి గత కొంతకాలంగా బోయిన్పల్లిలో నివాసం ఉంటున్నారు. విజయ్ భాటియాకు గత కొన్నేళ్ల క్రితం స్నేహ భాటియాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు హన్సిక(15), వంశిక(15) కమల పిల్లలు కొడుకు వీర్ ఉన్నారు. రోజూ లాగే బుధవారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో చిన్న కుమార్తె వంశిక ముందుగా నిద్రలేచి తల్లిదండ్రులను లేపడానికి ప్రయత్నించగా ఎంతకీ లేవలేదు.

దీంతో ఆందోళన చెంది రాజస్థాన్‌లో ఉన్నత తాతకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఉండే వారి బంధువులకు సమాచారం చేరవేశారు. వెంటనే బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని దగ్గర్లో ఉన్న బాలాజీ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే తల్లీకూతురు మరణించండంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed