వామ్మో.. ఆ వాటర్ బాటిల్ అంత ఖరీదా?

by sudharani |
వామ్మో.. ఆ వాటర్ బాటిల్ అంత ఖరీదా?
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో లభించే వాటర్ బాటిళ్ల ధర సాధారణంగా రూ. 20 లు, లేదా 40 లేదా మహా అయితే 100 ఉంటది. కానీ, మనం ఇదివరకెన్నడూ ఊహించని విధంగా రేట్లు ఉండే వాటర్ బాటిళ్లు ఉంటాయని, వాటి ధర లక్షలల్లో ఉంటదని మీకు తెలుసా?.. అయితే.. ఓసారి ఈ కథనం చదవండి..
ఓ కంపెనీకి చెందిన వాటర్ బాటిల్ కు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉంది. అంతేకాదు దాని ధర లక్షల్లో ఉంటది. అదేమిటంటే.. అక్వాడి డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని(Acqua di Cristallo Tributo a Modigliani) అనే వాటర్ బాటిల్. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ వాటర్ బాటిల్ లో 750 మిల్లీ లీటర్ల నీళ్లు ఉంటాయి. ఈ వాటర్ బాటిల్ ధర 60 వేల డాలర్లు. అదే మన ఇండియా కరెన్సీ ప్రకారం.. రూ. 42 లక్షల వరకు ఉంటది. ఆ బాటిల్, అందులో ఉండే వాటర్ కూడా అత్యంత ప్రాముఖ్యం. దీనిని ఫిజీ, ఫ్రాన్స్ దేశాల్లో సహజ నీటి ఊటల నుంచి వచ్చిన నీటిని, కరిగిన మంచు నుంచి సేకరించిన నీటిని కలిపి ఆ బాటిల్ లో పోసి విక్రయిస్తారు. ఆ బాటిళ్లను 24 క్యారెట్ల బంగారం, క్రిస్టల్, వెండితో తయారు చేస్తారు. ఆ వాటర్ లో కూడా 23 క్యారెట్ల 5 మిల్లీ గ్రాముల బంగారం పొడిను కూడా కలుపుతారు. మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ వాటర్ బాటిల్ ఆఫ్ వాటర్ గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది.

Tags: Water Bottle, High Cost, Guinness Book Record, Gold, France

Advertisement

Next Story