- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూచరిత్రలో అత్యంత డేంజరస్ ప్రదేశం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్:
వంద మిలియన్ సంవత్సరాల క్రితం క్రూరమైన డైనోసార్లు, మొసళ్ల లాంటి జంతువులతో నిండి సహారా ప్రాంతం మానవాళి చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. మొరాకోలోని కెమ్ కెమ్ గ్రూప్ దగ్గరి అవశేషాల మీద పరిశోధన చేస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు. ఆఫ్రికాలో డైనోసార్ల సంచార సమయం నాటి విషయాలు తెలుసుకునేందుకు వీరు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు.
ఈ శాస్త్రవేత్తల టీమ్‌కి సారథి అయిన డెట్రాయిట్ మెర్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం వందేళ్ల క్రితం నాటి పరిస్థితుల గురించి జర్నల్ ప్రచురించారు. సహారాలో ఒకప్పుడు నది ఉండేదని, ఆ నది నీళ్ల కోసం వచ్చి పెద్ద పెద్ద పళ్లు ఉండే డైనోసార్లు అక్కడే నివాసం ఉండేవని, నీటి కోసం ఈ జంతువుల మధ్య ప్రమాదకర పోరాటాలు జరిగేవని చెప్పారు. దీంతో అక్కడి ఇతర జంతువులకు ప్రమాదాలు జరిగేవని అందుకే తాము ఈ ప్రాంతాన్ని భూచరిత్రలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణిస్తున్నట్లు వివరించారు.
Tags: morroco, Africa, paleontologist most dangerous place, journal