లాడ్జీలో మైనర్‌పై అత్యాచారం.. ఇంటి ముందే వదిలేసి వార్నింగ్

by Sumithra |
rape
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్‌ను పేరెంట్స్ వద్దకు తీసుకెళ్తానన్న యజమాని దారుణానికి ఒడిగట్టాడు. మార్గమధ్యలో ఓ లాడ్జీకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో‌ సంచలనం రేపింది.

అసలేం జరిగిందంటే..!

పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ దంపతులు పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేస్తుండేవారు. వారి కూతురిని(14) థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని మైనర్‌ను నమ్మించిన ఇంటి యజమాని టూవీలర్‌పై అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. బాలికను బెదిరించడమే కాకుండా.. దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్నాడు. అనంతరం బాధితురాలిని తల్లిదండ్రుల వద్ద వదిలేశాడు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని మైనర్ పేరెంట్స్‌కు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story