గణేశ్ నిమజ్జనం చూపిస్తామంటూ మైనర్‌ బాలిక కిడ్నాప్.. కాసేపటికి సీన్ రివర్స్..

by Anukaran |
గణేశ్ నిమజ్జనం చూపిస్తామంటూ మైనర్‌ బాలిక కిడ్నాప్.. కాసేపటికి సీన్ రివర్స్..
X

దిశ, సంగారెడ్డి : గణేశ్ నిమజ్జనం ఉందని మైనర్‌ బాలికను నమ్మించిన ఓ ఇద్దరు యువకులు అపహరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు వినాయక విగ్రహాలను చూపిస్తామని నమ్మించి ఓ మైనర్ బాలికను సంగారెడ్డి నుండి జోగిపేట వైపు తీసుకెళ్తూ శివ్వంపేట కల్లు దుకాణం వద్ద కల్లు తాగడానికి ఆగారు. అయితే బాలిక ఏడుస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆ ఇద్దరు యువకులను నిలదీసారు.

దీంతో వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు నిందితులు చెప్పడంతో పుల్కల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు చౌటకూరు మండలంలోని శివ్వంపేట వద్ద నిందితులను పట్టుకున్నారు. అక్కడి నుంచి బాలికను సురక్షితంగా సంగారెడ్డి రూరల్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నిందితులు కందికి చెందిన నగేశ్, సదాశివ పేట కు చెందిన సాయి లుగా గుర్తించామని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సంగారెడ్డి డీఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story