- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వార్డు మెంబర్ కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ వికారాబాద్: వాగులో గల్లంతై మృతి చెందిన పులుసు మామిడి గ్రామ వార్డు మెంబెర్ ఇసాక్ పాషా కుటుంబానికి అండగా ఉంటామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మృతుడి గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇసాక్ మృతి అత్యంత బాధాకరం, మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. భర్తను కోల్పోయి ఇద్దరు కవల పిల్లలతో రోధిస్తున్న భార్య సమినా బేగంను చూసి మంత్రి చలించిపోయారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అండగా ఉంటామని మృతుని తండ్రి ఖాజా మియాకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , కలెక్టర్ నిఖిల , అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.