కన్నీరు పెట్టుకున్న హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-04-21 05:29:52.0  )
కన్నీరు పెట్టుకున్న హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట: సీనియర్ జర్నలిస్ట్ చింత నాగరాజు అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నా మనసు కలచివేసిందని కంటతడి పెట్టుకున్నాడు. ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయానని అన్నారు. జర్నలిస్టుగా నిరాడంబరతకు, నిబద్ధతకు మారుపేరు ఆయనని కొనియాడారు.

జర్నలిస్టుగా ఆయన రాసిన కథనాలు ప్రజాపక్షం వైపు, సామాజిక, మానవతా కోణాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. అలానే కరోనా మహమ్మారి కళ్ళముందు ఉన్న వ్యక్తి ని కనపడకుండా.. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎంత ప్రయత్నం చేసిన ఆయనను బతికించుకోలేక పోయామని బాధ పడ్డారు. ఒక గంట క్రితమే మాట్లాడిన వ్యక్తి ఇప్పుడిక లేడనే విషయం కలచి వేస్తుందన్నారు. చింత నాగరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Next Story