- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిర్యాలగూడలో రైతు మెగా రుణమేళా ప్రారంభం
దిశ, నల్లగొండ: రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు మెగా రుణ మేళా కార్యక్రమాన్ని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు చెక్కులను అందజేశారు. రైతు శ్రేయస్సుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందని గుత్తా అన్నారు. రైతులకు రూ.25,000ల రుణమాఫీ ప్రకటించిందని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.21 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా.. ఇవాళ ఒక కోటి రుణమాఫీ జరిగినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మిగతావి ఐదు విడతలుగా రూ.25,000 చొప్పున రైతులు రుణమాఫీ పొందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు వెయ్యి కోట్లతో నడుస్తోందని.. స్వల్పకాలిక రుణాలు రూ.310 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.380 కోట్లు అప్పుగా ఇచ్చిందని వెల్లడించారు.