కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

by Shyam |
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
X

దిశ, కాటారం: వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కండిషన్ లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెడికల్ ఆఫీసర్ లావణ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాదె రమేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా గత ఏప్రిల్ నెల నుంచి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అందక కుటుంబాలను పోషించే పరిస్థితి లేక, అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందించాలన్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed