- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవోదయ ఆసుపత్రిలో దారుణం..
దిశ, బేగంపేట : హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు. అప్పటికే రూ. 12 లక్షలు వెచ్చించి చికిత్స చేయించారు. చనిపోయిన తర్వాత కూడా మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రి చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని నవోదయ ఆస్పత్రిలో జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందినా పిచ్చయ్య(32) కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని నవోదయ ఆస్పత్రిలో చేరాడు. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, కొద్దిగా ఊపిరితీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో.. ఆసుపత్రి వైద్యులు సమస్య ఏది లేదని చెప్పి జనరల్ వారులో ఆడ్మిషన్ చేసుకున్నారు. అదే రోజు.. మళ్లీ పరిస్థితి బాగా లేదని చెప్పి రాత్రి ఐసీయూకు తీసుకుని వెళ్లారు. మరోసటి రోజు నుంచి ఐసీయూలో చికిత్స మొదలు పెట్టారు.
ఇలా 8 రోజుల పాటు చికిత్స అందిస్తూ కోలుకుంటున్నాడని చెబుతూ వచ్చారు. అటు తర్వాత ఆయనకు ఎలాంటి చికిత్స అందించారో.. చెప్పకుండా గురువారం ఉదయం 11 గంటలకు పిచ్చయ్య చనిపోయాడని బంధువులకు సమాచారం అందించారు. మరో రూ.10క్షల బిల్లు పెండింగ్‌లో ఉందని అది చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అనంతరం స్థానిక రామ్‌గోపాల్‌పేట పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఒక మెట్టు దిగి మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు.
ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం ధనుంజయరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి డబ్బులు ఇవ్వమని చెప్పలేదని ఆయన తెలిపారు. పిచ్చయ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో చనిపోయడే కానీ.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల కాదని అన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఫీజలు వసూళ్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.