- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠ పోరులో ఫైనల్‌కి చేరిన ముంబయి సిటీ
దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ఆటలో ఉండే అసలు సిసలు మజాను అభిమానులు మరోసారి అనుభవించారు. ఐఎస్ఎల్ 2020/21 సీజన్ సెకెండ్ లెగ్ తొలి సెమీస్‌లో ముంబయి సిటీ క్లబ్ అద్భుత విజయాన్ని సాధించింది. ముంబయి సిటీ, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఆటకు జోడించారు. ఆ సమయంలో కూడా ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చాలని రిఫరీ నిర్ణయించాడు. అయితే ఐదు పెనాల్టీల తర్వాత కూడా స్కోర్ 2-2తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 5 పెనాల్టీ షూటౌట్లకు ఆటను పెంచారు. ఆ సమయంలో ముంబయి జట్టు ఒక గోల్ అదనంగా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్‌లో ముంబయి 6-5 తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ విన్నర్ అయిన ముంబయి సిటీ ఐఎస్ఎల్ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సావియర్ గామ, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవాన్ గొన్జాల్వెస్‌కు లభించాయి.