- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషి తాకితే నవ్వే చెట్టు.. ఎక్కడుందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి లేని ప్రపంచాన్ని ఎక్కడ చూసి ఉండం. ఆ ప్రకృతి ఎన్నో కొత్త కొత్త వింతలను మనకు పరిచయం చేస్తూ ఉంటుంది. కొన్ని వింతలు మనసు చలించేలా ఉంటే.. మరికొన్ని వింతలు మనసును తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఒక వింత కూడా మన మనసులను తాకుతుంది. ప్రకృతిలో ఇంత అందం దాగి ఉందా? ప్రకృతిలో ఇన్ని వింతలు ఉన్నాయా ? అని అనిపిస్తుంది.
సాధారణంగా ప్రతి మనిషికి చక్కిలిగింతలు ఉంటాయి. ఎవరైనా తాకినప్పుడు చక్కిలిగింతలు పుట్టి నవ్వడం చూస్తూనే ఉంటాం. ఇక జంతువుల విషయంలో కొన్నిసార్లు ఇలాంటివి వింటూ ఉంటాం. మనం పెంచుకొనే కొన్ని జంతువులకు చక్కిలిగింతలు పెట్టి నవ్వించడానికి ట్రై చేస్తాం. మరి ఎప్పుడైనా చెట్టుకు చక్కిలిగింతలు పెట్టారా ? మీరు తాకినా వెంటనే చెట్టు నవ్వడం చూసారా ? చెట్టు నవ్వడమేంటి .. పిచ్చా ? అనకండి. నవ్వే చెట్టును చూడాలనుకుంటున్నారా ? అయితే ఉత్తరాఖండ్ లోని కళదుంగి అడవులకు పయనమవ్వండి.
‘రాండియా డుమిటారమ్’. కళదుంగి అడవులలో ఉండే ఈ చెట్టు బెరడును సుతారంగా తాకినా నవ్వుతున్నట్లు ఆకులను కదిలిస్తుంది. ఒక వ్యక్తి చేయి తాకినా అది వెంటనే కదలడం మొదలుపెడుతుంది. అంటే దానికి చక్కిలిగింతలు పుడుతున్నట్లు అర్థమన్నమాట. అందుకే ప్రజలు ఈ చెట్టుకు స్మైలింగ్ ట్రీ అని నామకరణం చేశారు. ఈ చెట్టును చూడడానికి ప్రతి ఏడాది వందల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. అసలు నిజంగా ఆ చెట్టుకు చక్కిలిగింతలు వస్తున్నాయా ? తాకిన వెంటనే ఆ చెట్టు ఎందుకు కదులుతుంది అనే దానిమీద పరిశోధకులు ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. దీనివెనుక కారణమేంటి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఏది ఏమైనా ప్రకృతిలోని ఎన్నో వింతల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు.