- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి కరోనా కొత్తమందు..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎంతమంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఈ వైరస్ ని కట్టడి చేయలేకపోతున్నారు. ఇక ఈ వైరస్ ని అదుపులో పెట్టాలంటే ఒకటే మార్గం.. అదే వ్యాక్సిన్. కానీ ఆ వ్యాక్సిన్ పంపిణి కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది. స్టాక్ లేక చాలామంది మొదటి డోస్ తీసుకొని రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొంతమంది మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ వేయించుకొంటే .. రెండో డోస్ మరో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇక ఇలాంటి దారుణ పరిస్థితిలో కరోనాకు సరికొత్త మందు మార్కెట్‌లో వచ్చేసింది. డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డీజీ మెడిసిన్ ఓ గేమ్ ఛేంజర్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2 డీజీ మందుకు సంబంధించిన తొలి బ్యాచ్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం విడుదల చేశారు. రోగులకు ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని కూడా ఈ మందు తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణ శాఖ తెలిపింది. కరోనా వైరస్ నియంత్రణకు తొలి మెడిసిన్‌గా భావిస్తున్న 2 డీజీ మెడిసిన్ ( 2 DG Medicine) మేకిన్ ఇండియా కావడం విశేషం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ( Dr Reddys labs), డీఆర్డీవో (DRDO) కలిసి సంయుక్తంగా ఈ మందును అభివృద్ధి చేశాయి. నోటి ద్వారా తీసుకునే ఈ మందు పౌడర్ రూపంలో ఉంటుందని, ఓ మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉండే రోగులకు చికిత్సలో వాడటానికి ఈ మందు ఉపయోగపడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ కోణంలోనే భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతించింది.
2 డీ ఆక్సీ డీ గ్లూకోజ్ ( 2 De oxy De glucose) మందును కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. త్వరలో ఇది పూర్తి స్థాయిలో మార్కెట్‌లో రానుంది. ఈ మెడిసన్ కనుక కరోనా తగ్గడానికి ఉపయోగపడితే వైద్య విధానంలో ఇదొక అద్భుతంగా పరిగణిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.