పెళ్లి పేరుతో మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్..

by Anukaran |   ( Updated:2021-09-29 08:21:11.0  )
పెళ్లి పేరుతో మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్..
X

దిశ, బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేస్తూ.. మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని మనస్థాపంతో జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో కావలి అనురాధ(22) జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. స్థానికంగా ఉండే కిరణ్‌ అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారి సహజీవనం చేసే దాకా వెళ్లింది.

గత ఆరేళ్లుగా ఇద్దరు అదే బస్తీలో గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల కిరణ్‌ వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనురాధ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story