- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మరో తీపికబురు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా స్పోర్ట్స్ డ్రెస్, స్పోర్ట్స్ షూ కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యాకానుక పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విద్యాకానుకలో భాగంగా అందించే వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పోర్ట్స్ డ్రెస్, స్పోర్ట్స్ షూ కూడా ఇవ్వాలని.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ప్రస్తుతం జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫారాలు(క్లాత్), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. అలాగే మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు. యూనిఫామ్ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేశారు. మరోవైపు ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను కూడా జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా అందజేసిన సంగతి తెలిసిందే.