ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే రక్తపు మడుగులో భార్య.. ఏం జరిగింది.?

by Sridhar Babu |
GDK-Murder
X

దిశ, గోదావరిఖని : వారిద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితంలో మద్యం చిచ్చుపెట్టింది. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ప్రశాంత్ మద్యానికి బానిసై కట్టుకున్న భార్యతో నిత్యం గొడవ పడేవాడు. తాగిన మైకంలో భార్య శ్రీ వేణిని కర్రతో కొట్టి చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లలో విషాదాన్ని నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని పీకే రామయ్య కాలనీకి చెందిన శ్రీ వేణిని సుందిళ్లకు చెందిన ప్రశాంత్.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగింది. అయితే, ప్రశాంత్ తాగుడుకు బానిస కావడంతో పని చేయకుండా భార్యను వేధిస్తుండేవాడు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు తరచు గొడవ పడేవారని తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్.. భార్యను కర్రతో కొట్టి చంపి పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed