- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేటు ఆసుపత్రిలో డిష్యుం డిష్యుం.. సిబ్బందిపై ఓ ప్రజాప్రతినిధి భర్త వీరంగం.. (వీడియో)
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై పట్టణానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త వీరంగం సృష్టించాడు. ఓ పేషెంట్ ఫీజు విషయంలో మాటా మాటా పెరిగి సిబ్బందిపై తన అనుచరులతో కలిసి ఆదివారం దాడికి దిగారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కొంతమంది వీడియో తీసి సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా ప్రజాప్రతినిధికి గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాగా దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉండగా గొడవ జరిగినట్లుగా ఆస్పత్రిలోని సీసీటీవీ లోనూ రికార్డ్ అయిన వీడియో బయటికి రావడం కొసమెరుపు. సంబంధిత వీడియోలో సమయం, తేదీ కూడా రికార్డు కావడం విశేషం. ఏది ఏమైనా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ప్రజాప్రతినిధి భర్త గతంలోనూ ఇతరులపై దాడికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొడవ జరిగిన ఆసుపత్రిలోనూ రోగులకు కనీస సౌకర్యాలు కల్పించక పోయినా కార్పొరేట్ స్థాయిలో ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల పట్ల ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది దురుసుగా, తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుంటారని అందులో భాగంగానే గొడవకు కారణం అయ్యిందని ఇతర రోగులు చెబుతున్నారు.