- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణ ఇప్పట్లో సాధ్యం కాదు: హోంమంత్రి
by Shyam |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ నివారణ ఇప్పట్లో సాధ్యం కాదని, వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రుతు పవనాల రాకతో వర్షాలు వస్తున్నందున, ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పూల తోటను శుభ్రం చేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించే వ్యక్తులు అనేక వ్యాధుల నుంచి రక్షించబడతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం, మాస్క్ లను ధరించడం వంటి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story