- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూట్యూబ్ టాప్ పెయిడ్ స్టార్స్
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలతో జనాలను ఆకట్టుకుంటున్న పలువురు యూట్యూబర్స్.. ఆర్జనలో మిగతా యూట్యూబర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది కూడా తొమ్మిదేళ్ల యూట్యూబర్ ర్యాన్ కాజీ.. హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్ ఆఫ్ 2020 లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు. మరి టాప్ 10 జాబితాలో ఎవరెవరున్నారంటే?
ర్యాన్ కాజీ
అత్యధిక వార్షికాదాయం సాధించిన యూట్యూబ్ స్టార్‌గా తొమ్మిదేళ్ల ర్యాన్.. వరుసగా రెండోసారి నిలిచాడు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ర్యాన్ కాజీ.. ‘ర్యాన్ వరల్డ్’ అనే యూట్యూబ్ చానల్ నడుపుతుండగా, అందులో ఆట వస్తువులు, విద్యా విషయాలపై వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. ఈ చానల్ ద్వారా గతేడాది రూ.185 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది రూ. 217 కోట్ల సంపాదనతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇతడి చానల్‌కు 41.7 మిలియన్ సబ్‌స్కైబర్స్ ఉండగా, 12.2 బిలియన్ వ్యూస్ ఉండటం విశేషం.
మిస్టర్ బీస్ట్
అమెరికాకు చెందిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్.. తన మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.176 కోట్లకు పైగా సంపాదిస్తూ, ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడి చానల్‌కు 7.8 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉండగా, 3 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఫైర్ వర్క్స్ వీడియోలు తీయడంలో మిస్టర్ బీస్ట్‌ను ది బెస్ట్ అని చెప్పొచ్చు. జులైలో దాదాపు 45లక్షల రూపాయల విలువైన క్రాకర్స్ ఉపయోగించి ఫైర్ వర్స్క్ షో చేశాడు. స్పెషల్ హాలీడే ఎపిసోడ్‌గా వచ్చిన ఈ కార్యక్రమాన్ని 60 మిలియన్ టైమ్స్ చూడటం విశేషం.
డ్యూడ్ పర్‌ఫెక్ట్ చానల్
అమెరికాకు చెందిన ఐదుగురు అన్మదమ్ములు (కోబీ, కోరి, గారెట్, కోడి జోన్స్, టైలర్ టోని).. తమ డ్యూడ్ పర్‌ఫెక్ట్ చానల్ ద్వారా 57.5 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడో ప్లేస్ లో నిలిచారు. ఫన్నీ స్టంట్స్‌తో వీక్షకులను ఎంగేజ్ చేసే ఈ బ్రదర్స్.. క్వారంటైన్ టైమ్‌లో తమ వీడియోల ద్వారా 1,60,000 డాలర్లను రెడ్ క్రాస్, ఫీడింగ్ అమెరికా సంస్థల కోసం సేకరించడం విశేషం.
రెట్ అండ్ లింక్, మార్కి ప్లైయర్ (మార్క్ షిష్‌బాచ్) ప్రెస్టన్ అర్సెమెంట్, నత్య(అనెస్తెషియా ర్యాడ్‌జింక్సియా), బ్లిప్పి (స్టీవెన్ జాన్), డేవిడ్ డొబ్రిక్, జెఫ్రీ స్టార్‌లు టాప్ టెన్‌లో ఉన్నారు.