ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ప్రభుత్వ ఆర్థిక సాయం

by Shyam |   ( Updated:2021-04-18 22:59:21.0  )
ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ప్రభుత్వ ఆర్థిక సాయం
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన ప్రైయివేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో చాలా మంది ప్రైయివేటు టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ప్రకటించారు. దీనికోసం మొత్తం 2,06,345 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,18,004 మంది ఎంపిక చేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. అయితే ఎంపికైన వారికి రేపటి నుంచి 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనున్నారు. అలానే 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం అందించనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధంచేసింది.

Advertisement

Next Story