‘రైతులను ఆదుకోవాలి… ఇసుక రవాణాను ఆపాలి’

by srinivas |
‘రైతులను ఆదుకోవాలి… ఇసుక రవాణాను ఆపాలి’
X

రైతులను ఆదుకోవడానికి తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దిగిరావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన జగన్‌కు లేఖ కూడా రాశారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఖరీఫ్‌ ధాన్యంలోనే ఇంకా 30 శాతం ఇంకా రైతుల వద్దే ఉండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వరి కోత యంత్రాల అద్దెలు బాగా పెరిగిపోయాయని, ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పట్టుగూళ్లు సాగు చేసే రైతులకు లక్షల్లో నష్టం వచ్చే పరిస్ధితి ఏర్పడిందన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని తెలిపారు. రైతుల పరిస్ధితి గమనించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అందులో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిందని, దానిని సొమ్ము చేసుకోవడానికి కొందరు దళారులు, వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని అన్నారు. ప్రజలకు ఇళ్ల వద్దే నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు చౌక ధరలకు అందించాలని, ఇందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. దేశమంతా విపత్కర పరిస్ధితుల్లో ఉంటూ రాష్ట్రంలో ఇసుక, గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాల మాఫియా తన కార్యకలాపాలు ఆపలేదని మర్శించారు. లాక్‌డౌన్‌కు ప్రధాని పిలుపు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, ద్విచక్ర వాహనాలపై తిరిగేవారిని ఆపేసుతన్న పోలీసులు, వందల లారీల్లో వెళ్తున్న ఇసుక, గ్రావెల్‌, మట్టిని ఎందుకు ఆపడం లేదని నిలదీశారు.

Tags: government, support, farmers, cm jagan, TDP leader chandrababu naidu

Advertisement

Next Story

Most Viewed