‘పెద్దతండా ప్రజలను ఆదుకోవాలి’

by Sridhar Babu |   ( Updated:2020-04-08 04:39:14.0  )
‘పెద్దతండా ప్రజలను ఆదుకోవాలి’
X

దిశ‌, ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండాను రెడ్‌జోన్‌గా ప్రకటించిన విషయం దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఆదుకోవాలని యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కనీసం నిత్యవసరాలకు కూడా ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని కావున ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు ఇంటింటికీ ప్రభుత్వమే అందజేయాలని ఆయన కోరారు. ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళన లో ఉన్న దృష్ట్యా అధికారులు ప్రజలకు అవగాహన కలిపించాలని, ప్రతిరోజు మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయాలని ఆయన తెలిపారు.

Tags : government, help, people, peddathanda, khammam, yuva telanganaparty leader

Advertisement

Next Story

Most Viewed