- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిసెంబర్ 1 నుంచి రేషన్ పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో సరుకులు అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఆహార భద్రత కార్డులున్న వారికి ప్రతి కుటుంబసభ్యునికి 6 కిలోలు బియ్యం ఎంతమంది ఉంటే అందరికీ, కిలోకు ఒక్క రూపాయి ఖరీదుతో అందించాలని నిర్ణయించింది. అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డులున్నవారికి కార్డుకు రూపాయికి కిలో చొప్పున 35 కిలోలు బియ్యం, అన్నపూర్ణ కార్డులున్నవారికి ప్రతి కార్డుకు 10 కిలోల బియ్యం ఉచితం, రూ.13.50లకు కిలో చక్కెర ఇవ్వాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో గోధుమలను రూ.7లకు కిలో చొప్పున 2 కిలోలు, మున్సిపల్ సంఘాల పరిధిలో ఒక కిలో గోధుమలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశించింది. ఉప్పును రూ.5లకు కిలో చొప్పున సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశించింది. కోవిడ్ దృష్టిలో పెట్టుకుని షానిటైజర్, సోషల్ డిస్టేన్స్, మాస్క్‌లను తప్పని పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం సూచించింది.