ఫోన్ చూడొద్దన్నారని విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఇదే!

by srinivas |
Supraja
X

దిశ, ఏపీ బ్యూరో : సెల్ ఫోన్ చూడొద్దు అన్నందుకు ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. నిత్యం ఫోన్‌కే పరిమితం అయ్యావని తల్లి మందలించడంతో మనస్థాపం చెందిన కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణం వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది. కరోనా ప్రభావంతో గత కొంత కాలంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రజ సెల్ ఫోన్‌కు బానిసైంది. దీంతో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించింది. ఈ ఘటనతో మనస్థాపం చెందిన సుప్రజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ లక్ష్మీ తెలిపారు.

ఎస్ఐ లక్ష్మీ మాట్లాడుతూ పాఠశాలలు పిల్లలకు సెల్ ఫోన్‌లు ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తునందున తల్లిదండ్రులు దగ్గరుండి గమనించాలని కోరారు. ఆన్‌లైన్‌లో క్లాసులతో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యే చిత్రాలు చూస్తున్నారా అనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story