కెనడా మహిళకు గ్రహాంతరవాసుల గిఫ్ట్?

by Shyam |
gift
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఉదయం నిద్రలేవగానే మీ ఇంటి పై కప్పుకు హోల్ పడిఉంటే? మీ దిండుపై రాయి కనిపిస్తే? ఏదో ప్రమాదం వాటిల్లిందనే భయం వెంటాడుతుంది. కెనడాకు చెందిన రూత్ హామిల్టన్ అనే మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె వెంటనే సమీపంలోని కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌కు ఫోన్ చేసి ఏదైనా బ్లాస్టింగ్ వర్క్ జరుగుతుందా అని వాకబు చేసింది. కానీ అటువైపు నుంచి అలాంటిదేం లేదనే సమాధానం రావడంతో.. ఆందోళనకు గురైంది. ఆ రాయి ఎక్కడ నుంచి పడింది? ఇది గ్రహాంతరవాసుల పనేనా? తెలుసుకుందాం.

హామిల్టన్ గాఢనిద్రలో ఉండగా.. హఠాత్తుగా పెద్ద రాయి ఇంటి పైకప్పును చీల్చుకుని వచ్చి, తన బెడ్‌పైనున్న దిండుపై పడింది. ఆ శబ్దానికి నిద్రలేచిన తను.. ముఖంపై పడిన చెత్తను చూసి గందరగోళానికి గురవడంతో పాటు అది ఏమై ఉంటుందా? అనే ఆలోచనలో పడింది. ఉల్కాపాతం కూలినట్లు ఎటువంటి క్లూ లేకపోగా.. సహాయం కోసం 911కు కాల్ చేసింది. ‘కికింగ్ హార్స్ కానిన్‌’ అనే ప్రాంతంలోని కన్‌స్ట్రక్షన్ సైట్‌లో బ్లాస్టింగ్ వల్ల ఇలా జరిగిందా? అని విచారించిన సంబంధిత అధికారి అది కాదని తేల్చాడు. అయితే అక్కడి వారు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశామని చెప్పడంతో.. ఆ పేలుడు వల్లే ఈ రాయి పడిందని నిర్ధారణకు వచ్చామని హామిల్టన్ వెల్లడించింది.

అయితే సదరు ఉల్క.. హామిల్టన్‌కు కొంచెం పక్కన పడటంతో తనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ఆ రాయిని ఆమె తన ఇంట్లోనే జ్ఞాపకంగా దాచుకోవడం విశేషం. ఎందుకంటే గతేడాది ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాకు చెందిన జాషువా హుటాగలుంగ్ ఇంటి పైకప్పు మీద ఒక ఉల్క కూలిపోవడంతో అతను 1.8 మిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. నిపుణుల ప్రకారం.. 2.1 కిలోగ్రాముల బరువున్న ఆ ఉల్క, అరుదైన రకం కావడంతో అతను భారీ మొత్తాన్ని పొందగలిగాడు. ఉల్కను CM1/2 కార్బొనేసియస్ కొండ్రైట్‌గా వర్గీకరించారు. చాలా అరుదైన రకానికి చెందిన ఈ ఉల్క ప్రతీ గ్రాము విలువ $ 853.

Advertisement

Next Story

Most Viewed