అధికారుల చర్యలు భేష్ : సత్యవతి రాథోడ్

by Shyam |   ( Updated:2020-03-26 05:24:46.0  )
అధికారుల చర్యలు భేష్ : సత్యవతి రాథోడ్
X

దిశ, వరంగల్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అధికారులు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ అమలు చేయాలని, ప్రజలు సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. కరోనా వ్యాప్తి నివారణా చర్యలపై కలెక్టరేట్‌లో నేడు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.‌ కరోనాను కట్టడి చేసేందుకు దేశం, రాష్ట్రం లాక్‌డౌన్ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ణప్తి చేశారు.

కరోనా వైరస్ వచ్చిన వారిని కాపాడడానికి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని, కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బంది కష్టపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరారు. చాలా మంది దాతలు కరోనా వైరస్ కట్టడికి విరాళాలు ఇస్తున్నారని, సూచనలు చేస్తున్నారని చెప్పారు. మంత్రులందరం కూడా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడంతో పాటు ఏడాదికి వచ్చే రూ.3 కోట్లను కూడా సీఎం సహాయ నిధికి ఇచ్చామన్నారు. ఎంపీలు కూడా వారి సంవత్సరపు ఫండ్ రూ.5 కోట్లను సీఎం సహాయ నిధికి ఇచ్చారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చారని తెలిపారు.

ఈ రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి, ప్రజలకు సోకకుండా ఉండడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తెల్ల రేషన్ కార్డున్న పేదవాళ్లకు నెలకు 12కిలోల బియ్యం, రూ.1500 ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు. దీనిని వినియోగించుకుని ప్రజలు బయటకు రాకుండా సహకరించాలని కోరారు. దేశంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడగించిన నేపథ్యంలో ఇంకా రాష్ట్ర పేదలకు ఎలాంటి సాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

Tags : functioning, authorities, good, prevention, corona virus, warangal, minister

Advertisement

Next Story