మెట్రో కేసు నాలుగు వారాల వాయిదా

by Shyam |
మెట్రో కేసు నాలుగు వారాల వాయిదా
X

దిశ, న్యూస్ బ్యూరో: మెట్రో టికెట్ల ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని దాఖలైన పిటీషన్‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల్లో ఒప్పందానికి విరుద్ధంగా టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని సీపీఐ(ఎం) గ్రేటర్ కమిటీ నాలుగు నెలల క్రితం కోర్టులో ప్రజాప్రయోజనాన్ని వేసింది. రాయితీలో టికెట్లును విక్రయించాల్సి ఉన్నా ఉల్లంఘించి ప్రయాణికులకు ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. కేసుపై విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీకి నోటీసులు జారీ చేసిన కోర్టు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed