- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో లుకలుకలు.. మైక్‌లో పేరు చెప్పలేదని మాజీ విప్ అలక
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ సీనియర్ నేత ఈరవత్రి అనిల్ అలక వహించారు. అలకకు కారణం తన పేరును పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మైక్ లో పలకలేదని అవమానంగా ఫీల్ కావడమేనని కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మాజీ విప్ పేరును మైక్ లో పలకలేదని గుర్తు చేసినా డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వినలేదు. ఇంధన ధరల పెంపుదలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఎడ్ల బండి పై జరిగిన నిరసన ర్యాలీలో ఈ తతంగం జరిగింది.
ఈ క్రమంలో ఎడ్ల బండి దిగి వెళుతున్న క్రమంలో ఈరవత్రి అనిల్- మానాల మోహన్ రెడ్డిల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బాల్కోండ కాంగ్రెస్ టికెట్ కోసం పోటిపడుతున్న బాల్కోండ నియోజకవర్గ ఇంచార్జీ మాజీ విప్ ఈరవత్రి అనిల్ పేరును జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కావాలని పలుకలేదని చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రేవంత్ రెడ్డి నిమమితుడైన తరువాత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మీదా యుద్ధం ప్రకటించారు. దాని కోసం సోమవారం ప్రతి జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చారు. అందుకు సీనియర్ లను ఇంచార్జీలుగా నియమించి వారి కనుసన్నులలో ఇంధన ధరలపై నిరసన కార్యక్రమాలు చేయడానికి సంకల్పించారు.
అందుకు నాయకులు, కార్యకర్తలు అందరు ఏకతాటిపై ఉండి నిరసన విజయవంతం చేయాలని రేవంత్ అదేశాలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది షరా మామూలే అన్న చందంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కోండ ఇంచార్జీల మధ్య సంవాదంతో పార్టీలో లుకలుకలు బహిర్గతం అయ్యాయని చెబుతున్నారు నేతలు. చివరకు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఇంటివద్ద ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి ఈరవత్రి అనిల్ హజరు కావడంతో కాంగ్రెస్ పార్టీలో అలుకలు, లుక లుకలు కామాన్ అనే చర్చ జరుగుతోంది.