భారీ వరదలకు 44 మంది మృతి

by Shamantha N |
భారీ వరదలకు 44 మంది మృతి
X

జకర్తా: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి తూర్పు ప్రాంతంలో భారీగా కురుస్తు్న్న వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 44 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఫ్లోర్స్ ద్వీపంలోని తూర్పు నెసా టెంఘరా ప్రావిన్సుకు చెందినవారున్నారు.

వరదల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అర్ధరాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నదులన్నీ పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలోనే వరదలు ముంచెత్తాయి. దీంతో నది పరీవాహక ప్రాంతంల్లోని ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి.

Advertisement

Next Story

Most Viewed