కరోనా వ్యాధికి తొలిసారి ఔషధ వినియోగం

by Shyam |
Molnufiravir drug
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధికి దేశంలో మొదటి సారిగా ఔషధాన్ని వినియోగిస్తున్నట్టుగా యశోదా ఆసుపత్రి ప్రకటించింది. నాట్కో ఫార్మాతో కలిసి 3వ క్లినికల్ ట్రయల్స్‌ను 1218 మందిపై చేపటనున్నామని యశోద ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. రోజుకు 2 సార్లు 400ఎంజీ మెల్నుఫిరావిర్ ఔషధాన్ని 5 రోజుల పాటు కరోనా పేషెంట్లకు అందిస్తామన్నారు. 10వ రోజు, 15వ రోజు పేషెంట్లను పరిశీలించి వ్యాధి తీవ్రతను మార్పులను నమోదు చేస్తామన్నారు. నెల రోజుల తరువాత ఔషద పనితీరు ఫలితాలను వెల్లడిస్తున్నామని వివరిచారు.

అమెరికాలో మొదటి విడత అధ్యయనాన్ని జంతువులపై, రెండ విడత అధ్యాయనాన్ని 78 మంది కరోనా పేషెంట్లపై నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని మోల్నూఫిరావిర్ ఔషధం విజయవంతంగా నియంత్రించిందని చెప్పారు. 3వ విడత క్లినికల్ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా యశోద ఆసుపత్రికి అనుమతులిచ్చిందని చెప్పారు.

కరోనా వ్యాధి సోకిన 18 నుంచి 60 ఏళ్ల వయసు గల వారిని ఈ అధ్యయనాల కోసం ఎంపిక చేశామన్నారు. తేలికపాటి, మద్యస్థ వ్యాధి లక్షణాలున్న వారికి మోల్నూ ఫిరావిర్‌తో చికిత్సలు చేసి వైరస్‌ను అరికట్టవచ్చిన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed