డెల్టాప్లస్ తొలి మరణం.. ఎక్కడంటే ?

by Shamantha N |
డెల్టాప్లస్ తొలి మరణం.. ఎక్కడంటే ?
X

దిశ,వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ఎప్పటికప్పుడు దాని రూపాన్ని మార్చుకుంటూ దాడి చేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గింది అనుకునేలోపే డెల్టాప్లస్ వేరియంట్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. దేశంలో డెల్టాప్లస్ వేరియట్ తొలి మరణం నమోదయ్యింది. మరో రెండు నెలలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డెల్టా వేరియంట్ మరింత బలపడి డెల్టాప్లస్గా మారడం ఆందోళనకు గురి చేస్తుంది.

ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్ వలన ఓ రోగి చనిపోవడం మరిత ఆందోళన కలిగిస్తుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డెల్టాప్లస్ మరణం వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఐదుగురికి డెల్టాప్లస్ వేరియంట్ సోకింది. అందులో నలుగురు కోలుకోగా ఒకరు మాత్రమే మరణించారు. కరోనా వైరస్ డెల్టాప్లస్‌గా మారిన తర్వాత మరిన్ని పరీక్షలు చేస్తున్నామంటున్నారు మధ్యప్రదేశ్ సర్కార్. అయితే ఈ డెల్టాప్లస్ వేరియంట్ టీకా తీసుకున్న నలుగురు కోలుకున్నారని, టీకా తీసుకోని వ్యక్తినే మరణించాడని ప్రభుత్వం వర్గాలు తెలుపుతున్నాయి. కావునా అందరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు డెల్టాప్లస్ వేరియంట్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర సర్కార్ సన్నద్ధం అవుతున్నది.

Advertisement

Next Story