మొదటి రోజు బంద్ సంపూర్ణం

by Shyam |
మొదటి రోజు బంద్ సంపూర్ణం
X

దిశ, పరకాల: పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత 27 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకీ ప్రభుత్వం స్పందించకపోవడంతో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి పట్టీపట్టనట్లు వ్యవహరించటం ఇందుకు కారణమని, ఆయన వైఖరిని నిరసిస్తూ 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. దాంతో మంగళవారం ఉదయం నుండే బంధు అమల్లోకి వచ్చింది. స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి జిల్లా సాధన సమితికి బాసటగా నిలిచారు. బంద్ సందర్భంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు పెసరు విజయ్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆటంకంగా ఉన్నారని, ఆయన సుముఖంగా ఉంటే ఈపాటికి జిల్లా ఏర్పాటు ఎప్పుడు జరిగేదని విజయ్ చందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా సాధన విషయంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యం వీడి పరకాల ప్రజల అభీష్టం మేరకు పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటింప చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే స్వచ్ఛంధంగా తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకునే సమస్య లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయంతి లాల్, అమర వీరుల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి, కాంగ్రెస్ నాయకులు దుబాసి వెంకటస్వామి, మేఘనాథ్, మార్త బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed