వాషింగ్టన్‌లో ‘కానా’ వార్షికోత్సవం

by Anukaran |   ( Updated:2020-11-09 10:33:21.0  )
వాషింగ్టన్‌లో ‘కానా’ వార్షికోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: గౌడ సంఘాల ఐక్యత కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌడ బంధువులు ఏకతాటి పైకి రావాలని తెలంగాణ-ఏపీ మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.వి గోపాల కృష్ణ, ఏపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ ఐక్యతతోనే గుర్తింపు, హక్కులను సాధించవచ్చన్నారు. సోమవారం కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రథమ వార్షికోత్సవ సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. ఈ సమావేశంలో జూమ్ యాప్ ద్వారా ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కౌండిన్య అసోసియేషన్ నార్త్ అమెరికా (KANA)లోగోను వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించగా.. వెబ్‌సైట్‌, బ్రోచర్‌ను ఏపీ మంత్రి ఎస్.వి గోపాల కృష్ణ, రెడ్డి సుబ్రమణ్యం ప్రారంభించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతూ.. రెండు ప్రభుత్వాలు గౌడల అభివృద్ధికి తోడ్పడుతాయన్నారు. కానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా పథకాలు ఎందరికో ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కరోనా కాలంలో ఎంతో మందికి నిత్యవసరాలు, అమెరికాలో షెల్టర్ లేని వారిని కూడా ఆదుకున్నామని కానా ఫౌండర్ రమేశ్ గౌడ్ వివరించారు. మాతృభూమిని వదిలి విదేశాల్లో సెటిల్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా గీత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

‘KANA’ వార్షికోత్సవంలో ఎవరెవరు పాల్గొన్నారంటే:
ఈ కార్యక్రమానికి కానా ఫౌండర్ రమేష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎపీ మంత్రి గోపాల కృష్ణ, ఎంపీ భరత్, ఏపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నారు. వీరితో పాటు గౌడ నేతలు పొన్నం ప్రభాకర్‌, బూర నర్సయ్య గౌడ్‌, స్వామి గౌడ్‌, గొడిశెల రాజేశం గౌడ్‌, గౌతు శిరీషా, అమరగాని కృష్ణయ్య గౌడ్‌, పూదారి వెంకట్రాజం గౌడ్‌, పల్లె లక్ష్మణ్‌ గౌడ్‌, డా. విజయ్‌ భాస్కర్‌, జూలురి ధనలక్ష్మి, డా.ఇవి. నారాయణ, జస్టీస్‌ ఈశ్వరయ్య, గంగాధర్‌ గౌడ్‌ ఇతర కానా ఫౌండేషన్ మెంబర్లు వీడియో కాన్ఫరెన్స్‌లోనే హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed