- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వింత వ్యాధిపై మూడు రోజుల్లో నివేదిక : ఆళ్ల నాని
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి సంబంధించి పరీక్షల తుది నివేదిక మూడు రోజుల్లో వస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితులను ఆయన ఆదివారం పరామర్శించారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈసందర్భం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం సాధారణ స్థితికి చేరినట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. వైద్య బృందాలు బాధితుల ఇంటికెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని చెప్పారు. బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామన్నారు. 650 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్నట్లు మంత్రి నాని వెల్లడించారు.
Advertisement
Next Story